Giddalur: గిద్దలూరు 9వ వార్డులో హోరాహోరీ ప్రచారం సైకిల్ వర్సెస్ గ్లాస్!
Giddalur: గిద్దలూరు 9వ వార్డులో ఆసక్తికరంగా మున్సిపల్ పోరు. కూటమిలో సైకిల్ వర్సెస్ గ్లాస్.. బరిలో టీడీపీ అభ్యర్థి రవణమ్మ, జనసేన రెబల్ అభ్యర్థి శ్యామల.
Giddalur: గిద్దలూరు 9వ వార్డులో హోరాహోరీ ప్రచారం సైకిల్ వర్సెస్ గ్లాస్!
గిద్దలూరు: మున్సిపల్ ఎన్నికల ప్రచారం పట్టణంలో హోరాహోరీగా సాగుతోంది. ముఖ్యంగా 9వ వార్డులో రాజకీయ పోటీ ఆసక్తికరంగా మారింది. ఎన్డీఏ కూటమి రెబల్ అభ్యర్థిగా జనసేన పార్టీ నుంచి బరిలోకి దిగిన బేతంశెట్టి శ్యామల గ్లాస్ గుర్తుపై ప్రచారం నిర్వహిస్తున్నారు. మరోవైపు ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పార్టీ అయిన తెలుగుదేశం తరఫున అలిశెట్టి రవణమ్మ సైకిల్ గుర్తుపై ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.
ఒకే కూటమికి చెందిన పార్టీల అభ్యర్థులు ఒకే వార్డులో వేర్వేరు గుర్తులతో ప్రచారం నిర్వహిస్తుండటంతో 9వ వార్డు ఎన్నికలపై స్థానికంగా ఆసక్తి నెలకొంది. ఇరువురు అభ్యర్థులు ఇంటింటి ప్రచారంతో ఓటర్లను కలుస్తూ తమకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. ఈ పోటీలో వార్డు ఓటర్లు ఎవరికి మద్దతు ఇస్తారనేది ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.




