Giddalur: గిద్దలూరులో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
Giddalur: గిద్దలూరులో మదరసా ఆధ్వర్యంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. విద్యార్థినుల దేశభక్తి ర్యాలీ. భిన్నత్వంలో ఏకత్వ చాటింపు.
Giddalur: గిద్దలూరులో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
గిద్దలూరు: గిద్దలూరులోని మదరసా ఇస్లామియా అరబియా దారుల్ ఉలూమ్ నిస్వాన్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు దేశభక్తి నినాదాలతో ర్యాలీ నిర్వహించి, జాతీయ సమైక్యతను చాటిచెప్పారు.
కులమతాలకు అతీతంగా.. భారతీయులం ఒక్కటే అనే సందేశాన్ని ర్యాలీ ద్వారా చాటుతూ విద్యార్థినులు దేశభక్తిని చాటారు. జాతీయ జెండాను గౌరవిస్తూ, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు.
దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని, భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశ బలమని నిర్వాహకులు పేర్కొన్నారు. దేశ ఐక్యత, సమగ్రత, సోదరభావాన్ని కాపాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతమైన పౌరులుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
“మతాలు వేరైనా.. మన రక్తం ఒక్కటే..
భాషలు వేరైనా.. మన దేశం ఒక్కటే..
కులాలు వేరైనా.. మనమంతా భారతీయులమే!” అనే సందేశంతో వేడుకలు దేశభక్తి స్ఫూర్తిని నింపాయి.




