Giddalur: ముండ్లపాడు సర్పంచ్ బరిలో టీడీపీ అభ్యర్థిగా కడియం లక్ష్మి

Giddalur: గిద్దలూరు మండలం ముండ్లపాడు సర్పంచ్‌గా కడియం లక్ష్మిని ప్రకటించిన టీడీపీ; ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి మద్దతు, సీసీ రోడ్లు, తాగునీరే లక్ష్యం.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 21 Nov 2026 11:19 PM IST
Giddalur
X

Giddalur: ముండ్లపాడు సర్పంచ్ బరిలో టీడీపీ అభ్యర్థిగా కడియం లక్ష్మి

గిద్దలూరు: మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం ముండ్లపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కడియం లక్ష్మిని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి బలపరిచిన అభ్యర్థిగా ఆమె ఎన్నికల బరిలో నిలవనున్నారు.

కడియం లక్ష్మి కుటుంబానికి గ్రామ రాజకీయాలతో గతంలోనూ అనుబంధం ఉంది. ఆమె భర్త కడియం శేషగిరి గతంలో గ్రామ సర్పంచ్‌, గ్రామ పంచాయతీ పాలన, స్థానిక సమస్యలపై అవగాహన ఉంది,

ముండ్లపాడు గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కడియం లక్ష్మి ముందుకు సాగుతున్నారు. గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సమస్య పై ప్రాధాన్యత, అదేవిధంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే లక్షం.

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU