Giddalur: గిద్దలూరులో వ్యవసాయ బోర్ల తీగలను అపహరించిన దుండగులు!
Giddalur: మార్కాపురం జిల్లా గిద్దలూరు మున్సిపాలిటీ పరిధిలోని కొండపేట, పాములపల్లె గ్రామాల్లో దాదాపు 50 నుంచి 60 వ్యవసాయ నీటి బోర్ల తీగలను దుండగులు కత్తిరించి ఎత్తుకెళ్లారు.
Giddalur: గిద్దలూరులో వ్యవసాయ బోర్ల తీగలను అపహరించిన దుండగులు!
గిద్దలూరు: మార్కాపురం జిల్లా, గిద్దలూరు మున్సిపాలిటీ పరిధిలోని కొండపేట, పాముల పల్లె గ్రామాలకు చెందిన రైతుల పొలాల్లో ఉన్న వ్యవసాయ నీటి బోర్ల తీగలను కత్తిరించి ఎత్తుకెళ్లిన దుండగులు దాదాపు 50 నుంచి 60 బోర్లకు చెందిన తీగలను కత్తిరించడం జరిగిందని కొండపేట కు చెందిన రైతు రమేష్ తెలిపాడు.
ఒక్కో రైతుకు తీగలు అమర్చుకోవాలంటే 500 నుంచి 1000 రూ వరకు ఖర్చు అవుతుందని రమేష్ ఆవేదన వ్యక్తం చేశాడు, బోర్ల తీగలను కత్తిరించి ఎత్తుకెళ్లినవారిపై పోలీసులు గుర్తించి చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.




