Giddalur: బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే!

Giddalur: గిద్దలూరు టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి రూ.35 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 29 Jun 2026 4:22 PM IST
Giddalur
X

Giddalur: బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే!

Giddalur: మార్కాపురం జిల్లా గిద్దలూరు టిడిపి కార్యాలయంలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రులతో చికిత్స పొందేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్న 60 మందికి రూ.35 లక్షలకు పైగా విలువచేసే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేసినట్లు తెలిపారు.

ఇప్పటివరకు నియోజకవర్గంలో 1100 మందికి పైగా రూ. 9 కోట్లు విలువచేసే సీఎం రిలీఫ్ ఫండ్ అందించినట్లు ఎమ్మెల్యే అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే సంక్షేమ పథకాలు సీఎం అమలు చేశారని తెలిపారు.

జూలై 18వ తేదీన తల్లికి వందనం పథకం ద్వారా పిల్లల్ని బడికి పంపించే ప్రతి తల్లి ఖాతాలోకి రూ.13,000 జమ చేయబోతున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ప్రధాని నరేంద్ర మోడీ సారథంలో రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం నిర్వహిస్తున్నట్లు అన్నారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU

Next Story