Giddalur: 1,421 మంది రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

Giddalur: గిద్దలూరులో 'మీ భూమి - మీ హక్కు' కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి రైతులకు బార్‌కోడ్‌తో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేశారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 2 Sept 2026 4:25 PM IST
Giddalur
X

Giddalur: 1,421 మంది రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

గిద్దలూరు: గిద్దలూరు మండలం అంబవరం రెవిన్యూ పరిధిలోని వెల్లుపల్లి గ్రామంలో “మీ భూమి – మీ హక్కు” కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పాల్గొని మొత్తం 1,421 మంది రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ రైతుల భూములకు సంబంధించిన హక్కులను మరింత పటిష్టం చేసి, ఎటువంటి అవకతవకలు లేకుండా బార్కోడ్ లో క్లుప్తముగా భూ యజమాని వివరాలు పొందుపరిచి భూమిపై రైతులకు పూర్తి భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

“మీ భూమి – మీ హక్కు” కార్యక్రమం ద్వారా రైతులకు ప్రభుత్వ రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకాలను అందించడం సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు. రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు కృషి ఫలితంగా నేటితో మన ప్రాంత రైతుల కష్టాలు తీరనున్నాయి.

వెలుగొండ ప్రాజెక్టు ద్వారా నీరు విడుదల అయిన సందర్భంగా ప్రతి ఎకరాకు సాగు నీరు అందించాలని, ప్రతి ఇంటికి త్రాగు నీరు అందించి ఫ్లోరైడ్ ప్రభావం తగ్గించి సురక్షితమైన నీటిని అందించడం జరుగుతుంది హార్టీ కల్చర్ హబ్ ద్వారా పండ్ల తోటలు వేయడం వలన రైతులకు లబ్ధిదారులకు, మంచి లాభసాటి దిగుబడి వస్తుందని ప్రాంత అభివృద్ధి చెందుతుంది అని రైతులు, ప్రజలు సంతోషంగా ఉండాలని ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని మంచి చేసే ప్రభుత్వం నీ ఎప్పుడు ఎన్నుకోవాలి అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గిద్దలూరు మండల తహసీల్దార్ ఆంజనేయరెడ్డి , మార్కెట్ యార్డ్ చైర్మన్ బైలడుగు బాలయ్య, ZPTC బుడతా మధుసూదన్ రావు, మండల పార్టీ అధ్యక్షులు మార్తాల సుబ్బారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU

Next Story