Giddalur: పెద్ద చెరువు గ్రామానికి గుడ్ న్యూస్.. కొత్త రోడ్లు ప్రారంభించిన ఎమ్మెల్యే!
Giddalur: గిద్దలూరు మండలం పెద్ద చెరువు గ్రామంలో రూ.30 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ప్రారంభించారు.
Giddalur: పెద్ద చెరువు గ్రామానికి గుడ్ న్యూస్.. కొత్త రోడ్లు ప్రారంభించిన ఎమ్మెల్యే!
Giddalur: గిద్దలూరు మండలం క్రిష్ణంశెట్టిపల్లి , దిగువమెట్ట పంచాయతీ పరిధిలోని పెద్ద చెరువు గ్రామంలో రూ. 30 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన సి.సి రోడ్లను ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ప్రారంభించారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, కనెక్టివిటీని పెంపొందించి అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈ రహదారుల నిర్మాణం జరుగుతుందని ఆయన అన్నారు.రాబోవు రోజుల్లో వర్షాల కారణంగా స్థానికులు వాహన దారులు ఇకపై ఎటువంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు. నూతన రోడ్ల ఏర్పాటు పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల , స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Next Story




