Giddalur: పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి!
Giddalur: అర్ధవీడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సరస్వతి దేవి విగ్రహ ప్రతిష్ఠ: ప్రత్యేక పూజలు నిర్వహించిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి, ఘన సన్మానం.
Giddalur: పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి!
గిద్దలూరు: గిద్దలూరు నియోజకవర్గంలోని అర్ధవీడు మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు మోదాల సుధాకర్ రావు(విగ్రహ దాత) , అర్ధవీడు మండల ఆర్యవైశ్య సంఘం వారి ఆహ్వానం మేరకు నిర్వహించిన సరస్వతి దేవి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ముందుగా స్థానిక నాయకులు, కళాశాల యాజమాన్యం, విద్యార్థులు ఎమ్మెల్యే కు మేళతాళాలు, వాయిద్యాలతో వేదవచనాలతో సాగర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సరస్వతి దేవి జ్ఞానానికి, విద్యకు ప్రతీకగా నిలుస్తారని, విద్యార్థులు విద్యలో ఉన్నత శిఖరాలను అధిరోహించి భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడేలా ఎదగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. అనంతరం స్థానిక నాయకులు, ఉపాధ్యాయులు ఎమ్మెల్యే కు స్వామి విగ్రహం, నాగలి బహుకరించి ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు, అర్ధవీడు మండల నాయకులు, గ్రామ పెద్దలు, ప్రభుత్వ కళాశాల ఉపాధ్యాయులు , విద్యార్థులు , తదితరులు పాల్గొన్నారు.




