Giddalur: 4, 5 వార్డుల్లో ఎమ్మెల్యే తనయుడు దివ్యేష్ రెడ్డి విస్తృత ప్రచారం!

Giddalur: గిద్దలూరు 4, 5 వార్డుల్లో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తనయుడు దివ్యేష్ రెడ్డి ప్రచారం. టీడీపీ అభ్యర్థులు షేక్ రిజ్వానా, బోనబోయిన కవితలకు మద్దతుగా ఓట్ల విజ్ఞప్తి.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 24 Oct 2026 5:35 PM IST
Giddalur
X

Giddalur: 4, 5 వార్డుల్లో ఎమ్మెల్యే తనయుడు దివ్యేష్ రెడ్డి విస్తృత ప్రచారం!

గిద్దలూరు: పట్టణంలోని గణేష్ నగర్, రాజా నగర్ వార్డు లలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి తనయుడు, యువ నాయకుడు ముత్తుముల దివ్యేష్ రెడ్డి 4 , 5 వ వార్డుల్లో విస్తృతంగా పర్యటిస్తూ తెలుగుదేశం పార్టీ, బలపరిచిన అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా 4 వ వార్డు అభ్యర్థి షేక్ రిజ్వానా , 5 వ వార్డు అభ్యర్థి బోనబోయిన కవిత ,గార్లకు మద్దతుగా ప్రచారం చేస్తూ, ఓటర్లు తమ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి అభ్యర్థులకు మద్దతు తెలిపి గెలించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు బూనబోయిన చంద్రశేఖర్ , దుత్తా బాల ఈశ్వరయ్య, షేక్ జాఫర్, ఉల్లపు బాలయ్య,కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU