Giddalur: ఒంటరి వృద్ధురాలికి మత్తుమందు ఇచ్చి బంగారు గాజుల చోరీ
Giddalur: గిద్దలూరులో ఒంటరి వృద్ధురాలికి మత్తుమందు ఇచ్చి ఆరు తులాల బంగారు గాజులు చోరీ చేసిన తల్లీకొడుకులు. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు.
Giddalur: ఒంటరి వృద్ధురాలికి మత్తుమందు ఇచ్చి బంగారు గాజుల చోరీ
గిద్దలూరు: మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని సాయి విక్రమ్ కాలేజీ రోడ్డులో ఉంటున్న మార్తాల ఈశ్వరమ్మ అనే 75 సంవత్సరాల వృద్ధురాలిని మాయమాటలు చెప్పి జ్యూస్ లో మత్తుమందు కలిపి ఇచ్చి బంగారు గాజులు చోరి చేసిన మైనం గిద్దలూరులో వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే గత మూడు నెలల క్రితమే ఈశ్వరమ్మ ఇంటిపైన పోర్షన్ లో తల్లి కొడుకులు కిరాయికి దిగారు. ఒంటరిగా ఉన్న వృద్ధురాలితో పరిచయం పెంచుకుని అదును చూసి ఈరోజు ఉదయం 11 గంటలకు మాటలు కలిపి వారు ఉంటున్న ఫై పోర్షన్ లోకి వృద్దురాలిని తీసుకెళ్లి జ్యూస్ తాపించారు.
జ్యూస్ తాగిన ఈశ్వరమ్మ అపస్మారక స్థితిలో ఉండగా ఆమె చేతికి ఉన్న రెండు గాజులను తీసుకొని పారిపోయారు. కొద్దిసేపటికి చేరుకున్న ఈశ్వరమ్మ తన చేతి గాజులను చూసుకోగా వారి చేతిలో మోసపోయినట్లు గమనించింది.ఒక్కో గాజు 3 తులాలు ఉంటుందని రెండు గాజులు సుమారు 6 తులాలు ఉంటాయనిబాధిత వృద్దురాలు తెలిపింది. అలాగే ఈ విషయాన్ని తమ బంధువులకు గిద్దలూరు పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపింది.




