Giddalur: గిద్దలూరులో జేవీ నారాయణ గెలుపే లక్ష్యం: కూటమి నేతలు!

Giddalur: గిద్దలూరు మున్సిపాలిటీ చైర్మన్ కూటమి అభ్యర్థి జేవీ నారాయణను భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్, సోము వీర్రాజు, కూటమి ముఖ్య నేతలు పిలుపునిచ్చారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 24 Oct 2026 11:22 PM IST
Giddalur
X

Giddalur: గిద్దలూరులో జేవీ నారాయణ గెలుపే లక్ష్యం: కూటమి నేతలు!

గిద్దలూరు: గిద్దలూరు మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థి జేవీ నారాయణను అత్యధిక మెజార్టీతో గెలిపించడమే లక్ష్యంగా కూటమి నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని ముఖ్య నేతలు పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ఎన్నికల అబ్జర్వర్, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు, కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి కూటమి శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.కూటమి నాయకులు, కార్యకర్తలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయాలని సూచించారు. అభ్యర్థి విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, ప్రజల్లోకి వెళ్లి కూటమి అభ్యర్థికి మద్దతు కూడగట్టాలని పిలుపునిచ్చారు.

కూటమి శ్రేణుల మధ్య ఐక్యత, సమన్వయం ఉంటే ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించవచ్చని నేతలు పేర్కొన్నారు. అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ జేవీ నారాయణ విజయానికి కృషి చేయాలని స్పష్టం చేశారు. కూటమి ఐక్యతే బలం.. జేవీ నారాయణ గెలుపే లక్ష్యం.. సమిష్టి కార్యాచరణతో ముందుకు సాగాలని వారన్నారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU