Giddalur: కొమరోలు మండలంలోని రెండు పంచాయతీల్లో నవంబర్ 29న ఎన్నికలు
Giddalur: గిద్దలూరు నియోజకవర్గం కొమరోలు మండలంలోని అల్లినగరం, రెడ్డిచర్ల పంచాయతీలకు నవంబర్ 29న ఎన్నికలు జరగనున్నట్లు రిటర్నింగ్ అధికారి మొర్రి పిచ్చయ్య తెలిపారు.
Giddalur: కొమరోలు మండలంలోని రెండు పంచాయతీల్లో నవంబర్ 29న ఎన్నికలు
గిద్దలూరు: గిద్దలూరు నియోజకవర్గంలోని కొమరోలు మండలంలో రెండుగ్రామపంచాయతీలలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లుగా రిటర్నింగ్ అధికారి డాక్టర్ మొర్రి పిచ్చయ్య తెలిపారు. అల్లినగరంలో ఇద్దరు అభ్యర్థులు పోటీలో నిలుచున్నారని, 10 వార్డులకు 5 వార్డులు ఏకగ్రీవం కాగా,మరో 5 వార్డులకు ఎన్నిక జరగనున్నట్లు తెలిపారు.
అలాగే రెడ్డిచర్లలో నలుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారని, మొత్తం 12 వార్డులకు గాను, ఒక వార్డు ఏకగ్రీవం కాగా, 11 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 29వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నారు.




