Giddalur: గిద్దలూరులో మాజీ సైనికులకు పెన్షన్ అవగాహన సదస్సు
Giddalur: గిద్దలూరు బలిజ సంఘం భవనంలో మాజీ సైనికులు, వీతంతువులకు పెన్షన్, స్పర్శ్ అవగాహన సదస్సు. హాజరైన మార్కాపురం ZSWO లెఫ్టినెంట్ కర్నల్ అబ్దుల్ రహీమ్.
Giddalur: గిద్దలూరులో మాజీ సైనికులకు పెన్షన్ అవగాహన సదస్సు
గిద్దలూరు: గిద్దలూరు పట్టణంలోని బలిజ సంఘం కమ్యూనిటీ భవనంలో ఈ రోజు మాజీ సైనికులకు వితంతువులకు పెన్షన్ అవగాహన సదస్సు నిర్వహించారు.
Lt Col Abdul Rahim ZSWO markapuram వారు తన సిబ్బంది( GV సుధాకర్ , SENIOR ASST& D RAMAKRISHNA REDDY, WELFARE ORGANISOR తో) మాజీ సైనికులకు పెన్షన్ మరియు sparsh , welfare issues పైన అవగాహన కలిగించారు. పిల్లలకు ఉపకార వేతనాలు( KSB ద్వారా) వృత్తి విద్యలో మొదటి సంవత్సరం చదువు తున్న వారికి అబ్బాయి అమ్మాయిలకు (ప్రధాన మంత్రి ఉపకార వేతనాల క్రింద) ₹ 30/36 వేలు లభించ నున్నట్లు తెలిపారు. వెంటనే ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలని కోరారు.
ఈ ప్రాంతంలో మాజీ సైనికుల కుటుంబాలు సైనికులు & పారా మిలిటరీ దళాలకు చెందిన వారు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కలిపి దాదాపు 35 వేలకు పైగా ఉన్నందున, ఈ ప్రాంతం లో కేంద్రీయ విద్యాలయం మరియు NCC యూనిట్ ఏర్పాటు చేయాలని కోరారు. దానితో పాటు మార్కాపురం జిల్లా లో కలెక్టరేట్ లో ADHOC ZSWO ఆఫీసు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ZSWO సానుకులంగా స్పందిస్తూ , వెంటనే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. గిద్దలూరు ప్రాంతం లోని పలువురు యుద్ధ వితంతువులను, ZSWO సన్మానించడం జరిగింది. ఐడెంటిటీ కార్డ్స్/డిపెండెంట్ కార్డులు కొంతమందికి తయారు చేసి ఇచ్చారు. 40 కి పైగా పెన్షన్, కుటుంబ సభ్యుల పేర్ల మార్పిడి , AGI సంబంధించిన అప్లికేషన్స్ స్వీకరణ జరిగింది
రెవెన్యూ సమస్యలు ఏదైనా ఉంటే, ప్రత్యేకంగా తన దృష్టికి తీసుక రావాలని ZSWO తెలిపారు. 80 వ స్వాతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా, హర్ గర్ తిరంగాలో భాగంగా, మాజీ సైనికులు, ప్రతి ఇంట జెండా ఎగుర వేసి, మాజీ సైనికుడి ఫోటోతో, ZSWO వాట్సప్ లో పంపాలని కోరారు. వాటన్నిటిని జిల్లా కలెక్టర్ దృష్టికి వ్యక్తిగతంగా తీసుకు వెళ్లి, మాజీ సైనికులకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని తెలిపారు.
ICICI వారు SPARSH గురించి అవగాహన కలిగించారు. SPARSH కు సంబంధించి, ఏదైనా సమస్య ఉంటే, వారిని సంప్రదించాలని కోరారు. ఈ కార్య క్రమంలో గిద్దలూరు ప్రాంతానికి చెందిన మాజీ సైనికులు, సైనిక వితంతువులు పెద్దసక్యలో పాల్గొన్నారు.
గిద్దలూరు, కంభం ,రాచర్ల, బెస్టవారిపేట, ముండ్ల పాడు, KS పల్లి , ఆకవిడు కి చెందిన మాజీ సైనికుల సంఘం ప్రతినిధులను, JAC ESM గిద్దలూరు వారు ఘనంగా సన్మానం చేశారు. JAC తరపున CAPT G C అంకన్న, పి శ్రీనివాసులు, ఎస్. వేణు గోపాల్, కెపి,వెంకటేశ్వర్లు, డి , శాంసన్ , పి. గురువా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




