Giddalur:5 నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని శానిటేషన్ వర్కర్ల వినతి!
Giddalur: 5 నెలల గౌరవ వేతనాన్ని వెంటనే చెల్లించాలని కోరుతూ గిద్దలూరు ఎమ్మార్వో డీఈఓ కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందజేసిన వర్కర్లు, సీఐటీయూ నాయకులు.
Giddalur:5 నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని శానిటేషన్ వర్కర్ల వినతి!
గిద్దలూరు: ఈరోజు గిద్దలూరు మండలంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న స్కూల్ శానిటేషన్ వర్కర్లకు ఐదు నెలల పెండింగ్ గౌరవ వేతనము చెల్లించాలని ఈరోజు గిద్దలూరు మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం డేటా ఎంట్రీ ఆపరేటర్ భాస్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా స్కూల్ శానిటేషన్ వర్కర్స్ నాయకురాలు ఎం మేరీ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న స్కూల్ శానిటేషన్ వర్కర్లకు పెండింగ్లో ఉన్న ఐదు నెలల గౌరవ వేతనం చెల్లించాలని అన్నారు. ప్రతి నెల మొదటి వారంలో గౌరవ వేతనం చెల్లించాలని రాజకీయ వేధింపులు ఆపాలని ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని అన్నారు .
సిఐటియు జిల్లా నాయకురాలు డి రుతమ్మ గిద్దలూరు మండల కన్వీనర్ బి నర్సింహులు, జి విశ్రాంతమ్మ మాట్లాడుతూ అతి తక్కువ గౌరవేతనం తీసుకుంటున్న స్కూల్ శానిటేషన్ వర్కర్స్ కి నెలలు తరబడి వేతనాలు చెల్లించకపోతే వారి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాయని వారికి వెంటనే పెండింగులను ఐదు నెలల వేతనాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన పథకం కార్మిక సంఘం నాయకురాలు ఏ కుమారి స్కూల్ శానిటేషన్ వర్కర్స్ యూనియన్ నాయకులు మరియమ్మ, ఎస్కే మౌలాభి కే భారతి తదితరులు పాల్గొన్నారు.




