Giddalur: గిద్దలూరులో గ్యాస్ ఏజెన్సీలతో తహశీల్దార్ కీలక సమీక్ష!
Giddalur: గిద్దలూరు తహశీల్దార్ ఆఫీసులో గ్యాస్ ఏజెన్సీలతో సమీక్ష. సిలిండర్ల సకాల సరఫరా, బ్లాక్ మార్కెట్ నివారణ, ఐవీఆర్‌ఎస్ కాల్స్‌పై అవగాహనకు ఆదేశం.
Giddalur: గిద్దలూరులో గ్యాస్ ఏజెన్సీలతో తహశీల్దార్ కీలక సమీక్ష!
గిద్దలూరు: మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని గ్యాస్ ఏజెన్సీలతో సమీక్ష సమావేశం ఈ రారోజు సాయంత్రం గిద్దలూరు తాసీల్దార్ కార్యాలయంలో జరిగింది. గిద్దలూరు నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలకు చెందిన గృహ వినియోగ ఎల్పీజీ (LPG) గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించబడింది.
ఈ సమావేశంలో ప్రజలకు గ్యాస్ సిలిండర్లను సకాలంలో సరఫరా చేయడం, బుకింగ్ చేసిన సిలిండర్లను నిర్ణీత సమయంలో పంపిణీ చేయడం, వినియోగదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టడం, అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌ను పూర్తిగా అరికట్టడం, భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించడం వంటి అంశాలపై చర్చించడం జరిగింది
అదేవిధంగా, గ్యాస్ సిలిండర్ డెలివరీ అనంతరం వినియోగదారులకు వచ్చే IVRS (Interactive Voice Response System) కాల్స్‌కు తప్పనిసరిగా స్పందించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులకు mro సూచించారు. వినియోగదారుల నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్ సేవల నాణ్యతను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుందని, డెలివరీ సక్రమంగా జరిగిందో లేదో నిర్ధారించడంలో IVRS కాల్స్ కీలక పాత్ర పోషిస్తాయని వివరించారు. డెలివరీ సిబ్బంది కూడా వినియోగదారులకు IVRS కాల్స్ గురించి తెలియజేసి స్పందించేలా ప్రోత్సహించాలని సూచించారు.
అధికారులు మాట్లాడుతూ, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా గ్యాస్ ఏజెన్సీలు సమన్వయంతో పనిచేయాలని, వినియోగదారుల ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని, ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ పారదర్శకంగా సేవలు అందించాలని ఆదేశించారు.
గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తూ, గ్యాస్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవడంతో పాటు IVRS కాల్స్‌పై వినియోగదారుల్లో అవగాహన కల్పించి స్పందన శాతాన్ని పెంచేందుకు కృషి చేస్తామని తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా ఫౌరసరాఫరాల అధికారి, అంకయ్య, తహశీల్దార్,గిద్దలూరు, యం ఆంజనేయ రెడ్డి, ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహశీల్దార్, గిద్దలూరు సూర రామనారాయణ రెడ్డి మరియు ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహశీల్దారు , మార్కాపురం శ్రీమతి సాలమ్మ గిద్దలూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు.




