Giddalur: గిద్దలూరు విద్యా కమిటీల్లో టీడీపీ మద్దతుదారుల ఏకగ్రీవ ఎన్నిక
Giddalur: గిద్దలూరు నియోజకవర్గ పాఠశాల విద్యా కమిటీల ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి హర్షం.
Giddalur: గిద్దలూరు విద్యా కమిటీల్లో టీడీపీ మద్దతుదారుల ఏకగ్రీవ ఎన్నిక
గిద్దలూరు: మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని అన్ని పాఠశాలల్లో విద్యా కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ప్రోత్సాహంతో ఆయా పాఠశాలల్లో టీడీపీ పార్టీ మద్దతుదారులు విద్యార్థుల సమక్షంలో దాదాపు అన్ని చోట్ల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
విద్యార్థుల విద్యాభివృద్ధి, పాఠశాలల్లో మెరుగైన వసతులు, విద్యా ప్రమాణాల పెంపు లక్ష్యంగా విద్యా కమిటీలు సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా పార్టీ నాయకులు సూచించారు. ఏకగ్రీవంగా ఎన్నికైన చైర్మన్లు, వైస్ చైర్మన్లకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు.




