Markapuram: రేపు మార్కాపురంలో పవన్ కళ్యాణ్ జన్మదినం.. భారీ బైక్ ర్యాలీ!
Markapuram: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇమ్మడి కాశీనాథ్ జన్మదినాల సందర్భంగా సెప్టెంబర్ 2న మార్కాపురంలో బైక్ ర్యాలీ, పూజలు, వర్చువల్ ఈవెంట్ నిర్వహించనున్నారు.
Markapuram: రేపు మార్కాపురంలో పవన్ కళ్యాణ్ జన్మదినం.. భారీ బైక్ ర్యాలీ!
మార్కాపురం: జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, జనసేన మార్కాపురం నియోజకవర్గ ఇంచార్జ్ ఇమ్మడి కాశీనాథ్ జన్మదినోత్సవాలను పురస్కరించుకుని సెప్టెంబర్ 2న మార్కాపురంలో ఘనంగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జనసేన శ్రేణులు తెలిపారు. ఉదయం 9 గంటలకు జనసేన నియోజకవర్గ కార్యాలయం నుంచి భారీ బైక్ ర్యాలీ ప్రారంభమై శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
అనంతరం 10:30 గంటలకు జనసేన కార్యాలయంలో కేక్ కటింగ్ కార్యక్రమం జరగనుంది. ఉదయం 11 గంటలకు పవన్ కళ్యాణ్ వర్చువల్గా పాల్గొని జనసేన యువజన విభాగాన్ని ఆవిష్కరించడంతో పాటు పార్టీ శ్రేణులకు ప్రత్యేక సందేశం ఇవ్వనున్నారు. సాయంత్రం 4 గంటలకు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో కేక్ కటింగ్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో జనసేన యువత, నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని జనసేన మార్కాపురం నియోజకవర్గ ఇంచార్జ్ ఇమ్మడి కాశీనాథ్ కోరారు.




