Chimakurthy: కార్మికుల మధ్య వెంకటేశ్వరరావు పుట్టినరోజు.. బోనస్ పంపిణీ
Chimakurthy: సిద్ధ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత సిద్ధ వెంకటేశ్వరరావు జన్మదిన వేడుకలను చీమకుర్తిలో ఘనంగా నిర్వహించారు.
Chimakurthy: కార్మికుల మధ్య వెంకటేశ్వరరావు పుట్టినరోజు.. బోనస్ పంపిణీ
Chimakurthy: చీమకుర్తి మండలం సిద్ధ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత వెంకటేశ్వరరావు జన్మదిన వేడుకలను ప్రారంభించిన తమ్ముడు,కుమారుడు శిద్దా హనుమంతరావు. ఉచిత కంటి వైద్య శిబిరం, రక్తదాన శిబిరం ఏర్పాటు. ఉద్యోగులకు బోనస్ అందజేత బుధవారం కృష్ణ సాయి గ్రానైట్ క్వారీలో కార్మికుల మధ్య ఏర్పాటు చేసిన పుట్టినరోజు వేడుకల్లో శిద్దా హనుమంతరావు, శిద్దా భరత్ పాల్గొని భారీ కేక్ కట్ చేశారు.
ఒంగోలు_కర్నూలు రోడ్డు ప్రక్కన వేసవి దృష్ట్యా ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రిమ్స్ ఆసుపత్రి వైద్యుల పర్యవేక్షణలో శిబిరంలో 25 మంది రక్తదానం చేశారు. డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో 85 మందికి కంటి పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు.
కృష్ణ సాయి గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో పనిచేస్తున్న ఉద్యోగస్తుల పిల్లల లో 10 వ తరగతి, జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్లలో ప్రథమ స్థానం, ద్వితీయ స్థానం, తృతీయ స్థానం పొందిన విద్యార్థులకు నగదు బహుమతులను అందజేశారు. కృష్ణ సాయి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో పనిచేస్తున్న ఉద్యోగస్తులకు బోనస్ పంపిణీ చేశారు. భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా శిద్దా హనుమంతరావు, శిద్దా భరత్ లు మాట్లాడుతూ ప్రతి ఏడాదిశిద్దా వెంకటేశ్వరరావు పుట్టినరోజు వేడుకలు కార్మికుల మధ్య సేవా కార్యక్రమాలతో నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.
కార్యక్రమంలో కృష్ణ సాయి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ప్రతినిధి పి ఉదయ్, జనరల్ మేనేజర్ టీవీ మురళీమోహన్రావు, బి కమలాకర్, ఆంజనేయులు, రాంబాబు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.




