Peddaraveedu: పెద్దారవీడు నామినేషన్ కేంద్రం వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు!

Peddaraveedu: పెద్దారవీడు ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీటీసీ నామినేషన్ల స్క్రూటినీ వేళ అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్ఐ సైదుబాబు ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 24 Oct 2026 12:10 PM IST
Peddaraveedu
X

Peddaraveedu: పెద్దారవీడు నామినేషన్ కేంద్రం వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు!

Peddaraveedu: పెద్దారవీడు మండల ఎంపీడీవో కార్యాలయంలో జరుగుతున్న ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ, పరిశీలన కార్యక్రమం సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. గత మూడు రోజులుగా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఎస్ఐ సైదుబాబు ఆధ్వర్యంలో భద్రతా చర్యలు చేపట్టారు.

జిల్లా ఎస్పీ పంకజ్ కుమార్ ఆదేశాల మేరకు, డీఎస్పీ నిమ్మగడ్డ సత్యనారాయణ, సీఐ మాతంగి శ్రీనివాసులు పర్యవేక్షణలో నామినేషన్ కేంద్రం వద్ద పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు. నామినేషన్ కేంద్రానికి వచ్చే అభ్యర్థులు, వారి అనుచరులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వర్తిస్తున్నారు.

మరోవైపు, రిటర్నింగ్ అధికారి డాక్టర్ రమేష్ కుమార్, ఎంపీడీవో జాన్ సుందరం, తహసీల్దార్ రామకృష్ణ సమన్వయంతో నామినేషన్ల పరిశీలన కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా సాగేందుకు అధికారులు, పోలీసు సిబ్బంది సమన్వయంతో చర్యలు చేపట్టారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM