Markapuram: పుల్లలచెరువులో భారీ వర్షం.. నేలమట్టమైన అరటి, మిర్చి పంటలు!

Markapuram: మార్కాపురం జిల్లా పుల్లలచెరువులో ఈదురు గాలులతో కురిసిన భారీ వర్షానికి అరటి, మిర్చి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పంట నష్ట పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.

Srikanth Singam, Markapur
Published on: 15 Sept 2026 8:39 PM IST
Markapuram
X

Markapuram: పుల్లలచెరువులో భారీ వర్షం.. నేలమట్టమైన అరటి, మిర్చి పంటలు!

మార్కాపురం: మార్కాపురం జిల్లా పుల్లలచెరువు మండలం లో రెండు గంటల పాటు కురిసిన భారీ వర్షానికి అరటి, మిర్చి రైతులకు నష్టం వాటిల్లింది. పుల్లలచెరువు లో వర్షం తోపాటు భారీగా వీచిన ఈదురు గాలులకు అనేక ఎకరాలలో అరటి చెట్లు నేలకు విరిగి పడ్డాయి. పొలాల్లో నీళ్ళు నిలబడి మిర్చి మొక్కలు మునిగి పోయాయి.

దీంతో రైతులు లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి తీవ్రంగా నష్టపోయామని వాపోయారు. చేతికి అంది వచ్చిన అరటి పంట ఈదురు గాలుల ధాటికి చెట్లు ఇరిగిపోవడంతో భారీగా నష్టం వాటిల్లిందని,గత సంవత్సరం ధరలేక నష్టం జరిగితే ఇప్పుడు ఈ విధంగా నష్ట పోయామని అరటి రైతులు ఆవేదన వ్యక్తం చేసారు.

తెల్లగట్ల వద్ద భారీ వర్షానికి కాలువ కట్టలు తెగిపోయి మిర్చి పొలాలు నీట మునిగాయి. వ్యవసాయ శాఖ అధికారులు పొలాలకు వచ్చి నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం నుండి నష్ట పరిహారం అందించాలని రైతులు వేడుకుంటున్నారు. భారీగా కురిసిన వర్షం ధాటికి పుల్లలచెరువు లోని రెండు చెరువులు జలకళ నిండుకోవడంతో భూగర్భ జలాలు పెరిగి తాగు సాగు నీటికి ఇబ్బందులు ఉండవని ప్రజలు భావిస్తున్నారు.

Srikanth Singam, Markapur

Srikanth Singam, Markapur