Kataripalem: కటారిపాలెంలో భారీ చోరీ రైతు ఇంట్లో రూ.30 లక్షలు అపహరణ!

Kataripalem: బాపట్ల జిల్లా కటారిపాలెంలో దొంగల బీభత్సం. రైతు ఇంట్లో ట్రంకు పెట్టె పగులగొట్టి రూ.30 లక్షల నగదు అపహరణ, రంగంలోకి క్లూస్ టీమ్.

KaleshaVali (Bhasha), Chirala
Published on: 16 Aug 2026 9:40 AM IST
Kataripalem
X

Kataripalem: కటారిపాలెంలో భారీ చోరీ రైతు ఇంట్లో రూ.30 లక్షలు అపహరణ!

Kataripalem: బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కటారిపాలెంలో భారీ చోరి జరిగింది. పొలం అమ్మి.. ఇంట్లో దాచుకున్న రూ.30లక్షలు నగదును గుర్తుతెలియని వ్యక్తులు దోచుకెళ్లారు. గ్రామానికి చెందిన రైతు కటారి నరసింహరావుకు ఐదుగురు కూతుళ్లు ఉన్నారు.

ఇటీవల తన పొలం అమ్మి నలుగురు కూతుళ్లుకు పంచాడు. చివరి కూతురుకు చెందిన డబ్బులు నరసింహరావు వద్దే ఉన్నాయి. అయితే డబ్బులు దాచుకున్న ట్రంకు పెట్టే కనిపించక పోవడంతో ఆందోళన చెందిన నరసింహారావు చుట్టుపక్కల వారిని కేకలు వేశారు.

అయితే ఇంటి సమీపంలో పెట్టె పగులగొట్టి అందులోని రూ. 30లక్షలను దొంగలు ఎత్తుకెల్లారు. సమాచారం అందుకున్న చీరాల రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. దొంగలు ఆచూకీ కోసం చుట్టు పక్కల ప్రదేశాలను క్లూస్ టీం, డాగ్ స్కాడ్ సిబ్బంది జల్లెడ పడుతున్నారు.

KaleshaVali (Bhasha), Chirala

KaleshaVali (Bhasha), Chirala

Next Story