Markapuram: మార్కాపురం బీజేపీలో పదవుల రగడ

Markapuram: మార్కాపురం జిల్లా బీజేపీలో వర్గ విభేదాలు. దోర్నాల మండల అధ్యక్షురాలిగా సురవరం మల్లీశ్వరిని తొలగించడంపై సీనియర్ నాయకుల అసంతృప్తి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 24 April 2026 8:10 PM IST
Markapuram
X

Markapuram: మార్కాపురం బీజేపీలో పదవుల రగడ

Markapuram: మార్కాపురం జిల్లాలో బీజేపీ పార్టీలో అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయి. దోర్నాల మండల అధ్యక్ష నియామకం వివాదాస్పదంగా మారింది. ప్రస్తుతం మండల అధ్యక్షురాలిగా కొనసాగుతున్న సురవరం మల్లీశ్వరి పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నప్పటికీ, ఆమెను సంప్రదించకుండా కొత్త మండల అధ్యక్షుడిని నియమించడంపై స్థానిక నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్ నాయకులు విలేకర్ల సమావేశం నిర్వహించి నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

నాయకులు మాట్లాడుతూ జిల్లా పార్టీ అధ్యక్షుడు సెగ్గం శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి తంగిరాల అశోక్ రెడ్డి కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. పార్టీ అంతర్గత ప్రజాస్వామ్య విధానాలను పక్కనపెట్టి తీసుకున్న ఈ నిర్ణయం కార్యకర్తల్లో అసంతృప్తికి దారితీసిందని పేర్కొన్నారు. మహిళా నాయకురాలిగా చురుకుగా పనిచేస్తున్న మల్లీశ్వరిని పరిగణలోకి తీసుకోకుండా నిర్ణయం తీసుకోవడం సరైంది కాదన్నారు. ఈ విషయంపై పార్టీ అధిష్టానం జోక్యం చేసుకుని న్యాయం చేయాలని స్థానిక నాయకులు, కార్యకర్తలు కోరుతున్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story