Pedda Dornala: పెద్ద దోర్నాల ఘనంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం
Pedda Dornala: 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పెద్ద దోర్నాల మండల పరిషత్ కార్యాలయంలో 'యోగాంధ్ర' వేడుకలు ఘనంగా జరిగాయి.
Pedda Dornala: పెద్ద దోర్నాల ఘనంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం
పెద్ద దోర్నాల: 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దోర్నాల మండల పరిషత్ కార్యాలయంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) టి.ఎల్. ప్రసూన దేవి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా దోర్నాల మండల పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీలలోనూ యోగా కార్యక్రమాలు నిర్వహించగా, మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది కలిసి యోగా ఆసనాలు చేశారు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని, ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో యోగాను భాగంగా చేసుకోవాలని అధికారులు సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది, వివిధ శాఖల ప్రతినిధులు పాల్గొని యోగా ప్రాముఖ్యతపై అవగాహన పెంపొందించుకున్నారు. కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.




