Markapuram: త్రిపురాంతకేశ్వర స్వామి సన్నిధిలో రేపు ప్రత్యేక యోగా కార్యక్రమం
Markapuram: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్కాపురం జిల్లా త్రిపురాంతకేశ్వర స్వామి సన్నిధిలో రేపు ప్రత్యేక యోగా కార్యక్రమం జరగనుంది.
Markapuram: త్రిపురాంతకేశ్వర స్వామి సన్నిధిలో రేపు ప్రత్యేక యోగా కార్యక్రమం
మార్కాపురం జిల్లా: ఎర్రగొండపాలెం నియోజకవర్గము త్రిపురాంతకంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని త్రిపురాంతకేశ్వర స్వామి సన్నిధిలో రేపు ఉదయం 7 గంటలకు ప్రత్యేక పర్యాటక ప్రదేశ యోగా కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రకృతి సోయగాల నడుమ, ఆధ్యాత్మిక వాతావరణంలో జరగనున్న ఈ కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత, జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.
యోగాతో ఆరోగ్యం, మానసిక ప్రశాంతత పెంపొందుతాయని పేర్కొన్న కలెక్టర్ విజయ సునీత, జిల్లావ్యాప్తంగా ప్రజలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. త్రిపురాంతకేశ్వర స్వామి సన్నిధిలో నిర్వహించే ఈ యోగా కార్యక్రమం జిల్లాలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.




