Markapuram: గుండంచెర్ల చెంచు కాలనీలో ఘనంగా 'జన్ భాగీదారి' గ్రామసభ!

Markapuram: ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం గుండంచెర్ల చెంచు కాలనీలో 'జన్ భాగీదారి' కార్యక్రమంలో భాగంగా గ్రామసభను ఘనంగా నిర్వహించారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 19 May 2026 3:19 PM IST
Markapuram
X

Markapuram: గుండంచెర్ల చెంచు కాలనీలో ఘనంగా 'జన్ భాగీదారి' గ్రామసభ!

Markapuram: పెద్దారవీడు మండలము గుండంచెర్ల గ్రామ పంచాయతీ చెంచు కాలనీలలో సర్పంచ్ ఇండ్ల రామకృష్ణారెడ్డి, పెద్దారవీడు సొసైటీ చైర్మన్ రాజేశ్వర రెడ్డి తో కలిసి ఎంపీడీవో జాన్ సుందరం జన్ బాగిదారి కార్యక్రమం భాగంగా గ్రామ సభను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎంపీడీవో జాన్ సుందరం గ్రామ ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి మౌలిక సదుపాయాలు, ఆరోగ్య సమస్యలు, తాగునీరు, పారిశుధ్యం, నివాస సమస్యలు వంటి అంశాలను తెలుసుకున్నారు.

ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కారం చూపిస్తామని ఎంపీడీవో హామీ ఇచ్చారు. చెంచు కాలనీల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. గ్రామ ప్రజలు కూడా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఇండ్ల రామకృష్ణారెడ్డి, సొసైటీ చైర్మన్ రాజేశ్వర రెడ్డి పంచాయతీ అభివృద్ధి అధికారి శ్రీహర్ష, గ్రామ రెవెన్యూ అధికారి ఆది నారాయణ, స్వర్ణ గ్రామ సిబ్బంది, వైద్య సిబ్బంది, అంగన్‌వాడీ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story