Ardhaveedu: స్థానిక సంస్థల్లో 100% స్ట్రైక్ రేట్ సాధించడమే జనసేన లక్ష్యం!
Ardhaveedu: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో విజయం సాధించి 100% స్ట్రైక్ రేట్ సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని బాల రంగయ్య పిలుపునిచ్చారు.
Ardhaveedu: స్థానిక సంస్థల్లో 100% స్ట్రైక్ రేట్ సాధించడమే జనసేన లక్ష్యం!
Ardhaveedu: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో విజయం సాధించేలా కూటమి పార్టీలతో సమన్వయంగా పనిచేయాలని, 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని జనసేన పార్టీ ఒంగోలు పార్లమెంట్ నిర్వాహక దళ్ సభ్యుడు కాల్వ బాల రంగయ్య పిలుపునిచ్చారు.
ఈరోజు గిద్దలూరు నియోజకవర్గంలోని అర్ధవీడులో జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మండల స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఒంగోలు పార్లమెంట్ నిర్వాహక దళ్ సభ్యుడిగా ఎన్నికైన కాల్వ బాల రంగయ్యను ఈ సందర్భంగా జనసేన పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా కాల్వ బాల రంగయ్య మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు, జిల్లా నాయకులకు, గిద్దలూరు నియోజకవర్గ ఇన్చార్జి బెల్లంకొండ సాయిబాబాకు కృతజ్ఞతలు తెలిపారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన నాయకులు, జనసైనికులు సమష్టిగా పనిచేసి పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని కోరారు. కూటమి పార్టీల మధ్య సమన్వయం, నాయకులు, కార్యకర్తల ఐక్యత విజయానికి కీలకమని పేర్కొన్నారు.
అనంతరం ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన పాఠశాల విద్యా కమిటీ ఎన్నికల్లో అర్ధవీడు కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాల చైర్మన్‌గా ఎన్నికైన తోట వరలక్ష్మి (భార్య కేశన్న), బొల్లుపల్లి పాఠశాల విద్యా కమిటీ చైర్మన్‌గా ఎన్నికైన దాదే పెద్ద మస్తాన్లను కాల్వ బాల రంగయ్యతో పాటు జనసేన పార్టీ మండల నాయకులు సన్మానించారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షుడు కలగట్ల అల్లూరయ్య, మండల నాయకులు రంగయ్య, శ్రీపతి కృష్ణయ్య, బండి రంగయ్య, మాదాసు కార్తీక్, తోట కేశన్న, బిర్రి శేషాద్రి నాయుడు, దాది మస్తాన్, కొంకాల రంగస్వామి, కాల్వ పాండు, అంబటి దాసు బాబు, సిరిగిరి రమేష్, వీరణాల శివ, కేశవ రమణ, పసుపులేటి రమణ, పోల్ రాజు, సత్తి శ్రీనివాసులు, నన్నూరి వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు గోన కుమారు, శ్రీపతి మల్లికార్జున, అర్ధవీడు నాయకులు నక్క రామకృష్ణ, తోట వెంకటేశ్వర్లు, కంపెనీ వెంకటయ్య, షేక్ సుభాని, పోలిశెట్టి నారాయణ, గిరి రంగసాయి, కొమిరే వెంకటేశ్వర్లు, నల్లబోతుల అల్లూరయ్య తదితర నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.




