Bodapadu: స్వయంగా శ్రమించిన జాయింట్ కలెక్టర్ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి

Bodapadu: ప్రభుత్వం చేపట్టిన 'జల ధార- జల హారతి' కార్యక్రమంలో అధికార యంత్రాంగం మరియు ప్రజాప్రతినిధులు భాగస్వాములై ప్రజలకు ఆదర్శంగా నిలిచారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 15 May 2026 11:30 AM IST
Bodapadu
X

Bodapadu: స్వయంగా శ్రమించిన జాయింట్ కలెక్టర్ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి

మార్కాపురం: మండలంలోని బోడపాడు గ్రామంలో నిర్వహించిన జల ధార- జల హారతి కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు, ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గ్రామ పరిసరాల్లో నీటి వనరుల అభివృద్ధి, చెరువుల పరిశుభ్రత లక్ష్యంగా చేపట్టిన కార్యక్రమంలో వారు స్వయంగా జేసీబీ సహాయంతో కంప చెట్లను తొలగించి ప్రజలకు ఆదర్శంగా నిలిచారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నీటి సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు, కాలువలు పరిశుభ్రంగా ఉండేలా ప్రజల సహకారంతో కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పారు.

జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ “జల ధార- జల హారతి” కార్యక్రమం ద్వారా నీటి వనరులను పరిరక్షించడం మాత్రమే కాకుండా గ్రామాల్లో పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ మాలపాటి వెంకటరెడ్డి, ఉపాధి హామీ ఏపీడీ నిర్మల, ఎంపీడీవో చెన్నయ్య, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్, టీడీపీ నాయకులు, గ్రామ ప్రజలు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story