Yerragondapalem: గర్భిణీలు జాగ్రత్త.. రక్తహీనతపై శ్రీనివాసులు అవగాహన

Yerragondapalem: ఎర్రగొండపాలెం మండలం గురిజేపల్లి గ్రామంలో జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 2 May 2026 2:32 PM IST
Yerragondapalem
X

Yerragondapalem: గర్భిణీలు జాగ్రత్త.. రక్తహీనతపై శ్రీనివాసులు అవగాహన

మార్కాపురం జిల్లా: ఎర్రగొండపాలెం.. అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్. ఎర్రగొండపాలెం మండలం గురిజేపల్లి గ్రామంలో ఉన్న అంగన్వాడి కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న సౌకర్యాలపై ఆరా తీశారు. చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు పని సూచనలు చేశారు. చిన్నారులకు మంచి పౌష్టికాహారం అందించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని అంగన్వాడీ సిబ్బందికి తెలిపారు. అలాగే గర్భిణీలు, బాలింతలకు రక్తహీనత రాకుండా మంచి పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. అంతకు ముందు గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ, అంగన్వాడి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story