Markapuram: మార్కాపురంలో 'స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర' పారిశుద్ధ్య డ్రైవ్
Markapuram: స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా మార్కాపురం కాలేజీ రోడ్డులోని ఆదర్శ అపార్ట్‌మెంట్‌లో పారిశుద్ధ్య కార్యక్రమం జరిగింది.
Markapuram: మార్కాపురంలో 'స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర' పారిశుద్ధ్య డ్రైవ్
Markapuram: మార్కాపురం జిల్లా కేంద్రంలోని కాలేజీ రోడ్డులో ఉన్న ఆదర్శ అపార్ట్‌మెంట్‌లో శనివారం స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ నారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల మూడో శనివారం ప్రజల్లో పారిశుద్ధ్యంపై అవగాహన కల్పిస్తున్నామని జాయింట్ కలెక్టర్ తెలిపారు. బల్క్ వేస్ట్ జనరేటర్లు తడి, పొడి, శానిటరీ వ్యర్థాలను వేర్వేరుగా డస్ట్‌బిన్లలో భద్రపరచి పారిశుద్ధ్య కార్మికులకు అందజేయాలని సూచించారు.
ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, ఎక్కడపడితే అక్కడ చెత్త వేయకుండా బాధ్యతగా వ్యవహరించడం ప్రతి పౌరుడి కర్తవ్యమని పేర్కొన్నారు. స్వచ్ఛ ఆంధ్ర లక్ష్య సాధనకు ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి, నియోజకవర్గ టీడీపీ క్లస్టర్ ఇన్‌చార్జ్ కందుల రామిరెడ్డి, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.




