Peddaraveedu: పెద్దారవీడు నామినేషన్ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జేసీ పులి శ్రీనివాసులు!

Peddaraveedu: మార్కాపురం జిల్లా పెద్దారవీడు ఎంపీడీవో కార్యాలయంలోని నామినేషన్ కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు ఆకస్మికంగా తనిఖీ చేసి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 24 Oct 2026 12:00 PM IST
Peddaraveedu
X

Peddaraveedu: పెద్దారవీడు నామినేషన్ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జేసీ పులి శ్రీనివాసులు!

Peddaraveedu: మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో జరుగుతున్న నామినేషన్ ప్రక్రియను జిల్లా జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నామినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న తీరును పరిశీలించి, ఎన్నికల నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్లపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

రిటర్నింగ్ అధికారి డాక్టర్ రమేష్ కుమార్, ఎంపీడీవో జాన్ సుందరం, తాసిల్దార్ రామకృష్ణ తో నామినేషన్ల స్వీకరణ, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలపై సమీక్షించారు. నామినేషన్ ప్రక్రియ నిబంధనలకు అనుగుణంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా జరిగేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

అదేవిధంగా, నామినేషన్ కేంద్రం వద్ద చేపట్టిన భద్రతా ఏర్పాట్లపై ఎస్సై సైదుబాబును అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులకు సూచించారు.

నామినేషన్ ప్రక్రియ పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM