Prakasam: ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కోఆర్డినేటర్‌గా కైపు వెంకట కృష్ణారెడ్డి నియామకం!

Prakasam: ప్రకాశం జిల్లాతో పాటు పలు జిల్లాల కాంగ్రెస్ 'ఓట్ బచావో – దేశ్ బచావో' ప్రచార కోఆర్డినేటర్‌గా కైపు వెంకట కృష్ణారెడ్డి నియామకం. వైఎస్ షర్మిలకు కృతజ్ఞతలు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 25 Oct 2026 6:55 PM IST
Prakasam
X

Prakasam: ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కోఆర్డినేటర్‌గా కైపు వెంకట కృష్ణారెడ్డి నియామకం!

Prakasam: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలా రెడ్డి ఆదేశాల మేరకు, దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న “ఓట్ బచావో – దేశ్ బచావో” (ఓటును కాపాడండి – దేశాన్ని కాపాడండి) ప్రచార కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌లో PCC కోఆర్డినేటర్‌గా కైపు వెంకట కృష్ణారెడ్డి నియమితులయ్యారు.

ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికారిక నియామక ఉత్తర్వులు జారీ చేసింది. నియామక పత్రం ప్రకారం, AICC పరిశీలకురాలు శ్రీమతి లక్ష్మీ హెబల్కర్‌తో సమన్వయం చేసుకుంటూ తనకు కేటాయించిన ప్రాంతాల్లో ప్రచార కార్యక్రమాల నిర్వహణ, పార్టీ నాయకులు మరియు కార్యకర్తల సమన్వయ బాధ్యతలను ఆయన నిర్వర్తించనున్నారు.

ఆయనకు కేటాయించిన ప్రాంతాలు:

1. పల్నాడు జిల్లా

2. ప్రకాశం జిల్లా

3. ఒంగోలు నగరం

4. SPS నెల్లూరు జిల్లా

5. నెల్లూరు నగరం

6. తిరుపతి జిల్లా

7. తిరుపతి నగరం

8. చిత్తూరు జిల్లా

9. చిత్తూరు నగరం

కైపు వెంకట కృష్ణారెడ్డి ప్రస్తుతం ఆల్ ఇండియా అన్‌ఆర్గనైజ్డ్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ కాంగ్రెస్ (KKC), ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చైర్మన్‌గా, దర్శి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పనిచేస్తున్నారు.

ఈ సందర్భంగా కైపు వెంకట కృష్ణారెడ్డి మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి PCC కోఆర్డినేటర్‌గా బాధ్యతలు అప్పగించిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలా రెడ్డి కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ నాయకత్వం తనకు అప్పగించిన బాధ్యతను అంకితభావంతో నిర్వహిస్తూ, కాంగ్రెస్ పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.

“ఓట్ బచావో – దేశ్ బచావో” ప్రచారం ద్వారా ఓటు హక్కు ప్రాధాన్యత, ప్రజాస్వామ్య పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు, పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేస్తానని తెలిపారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్