Kambham: కంభంలో ఘోర ప్రమాదం పెళ్లి బృందం ఆటోను ఢీకొట్టిన లారీ.. నలుగురు మృతి

Kambham: కంభం జాతీయ రహదారిపై పెళ్లి బృందం ఆటోను లారీ ఢీకొట్టిన ఘటనలో నలుగురు దుర్మరణం. ఏడాదిన్నర చిన్నారి మృతి. ఎనిమిది మందికి తీవ్ర గాయాలు.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 3 July 2026 8:55 AM IST
Kambham
X

Kambham: కంభంలో ఘోర ప్రమాదం పెళ్లి బృందం ఆటోను ఢీకొట్టిన లారీ.. నలుగురు మృతి

కంభం: మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కంభం పట్టణంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై ఆటోని పెళ్లి బృందాన్ని లారీ ఢీ కొట్టింది. ప్రమాదంలో నలుగురు మృతి చెందగా మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు.

గాయపడ్డ వారిని అంబులెన్స్లలో కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు, క్షతగాత్రులు గిద్దలూరు నల్లబండ బజారుకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. నల్లబండ బజారుకు చెందిన వీరక్కకు కంభముకు చెందిన పాములేటికి ఈరోజు ఉదయం 9 గంటలకు వివాహం జరగవలసి ఉంది.

కంభంలోని వై జంక్షన్ వద్ద వినాయకుడి గుడిలో కొబ్బరికాయ కొట్టేందుకు పెళ్లి బృందం ఆగిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుంది. పోలీసులు జరిగిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో అలకనంద, అంకాలు, నగేష్, సంఘటన స్థలంలోనే మృతి చెందగా నాగేశ్వరి అనే ఏడాదిన్నర చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. గాయపడ్డ వారిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం మార్కాపురం తరలించారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU

Next Story