Kandukur: కందుకూరులో ఘనంగా గుర్రం జాషువా 131వ జయంతి సభ!

Kandukur: కందుకూరులో సెప్టెంబర్ 28న మహాకవి గుర్రం జాషువా 131వ జయంతి సభ. జడ్పీ బాలికల పాఠశాలలో కరపత్రాల ఆవిష్కరణ; ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు హాజరు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 22 Sept 2026 8:27 PM IST
Kandukur
X

Kandukur: కందుకూరులో ఘనంగా గుర్రం జాషువా 131వ జయంతి సభ!

కందుకూరు: ఈనెల 28న తేదీన కందుకూరులో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నందు సాయంత్రం 6 గంటలకు మహాకవి,విశ్వ నరుడు, కవి కోకిల,, నవయుగ కవి చక్రవర్తి, పద్మభూషణ్, మహాకవి గుర్రం జాషువా 131 వ జయంతి సభ సందర్భంగా ఈరోజు బాలికల ఉన్నత పాఠశాల నందు కరపత్రవిష్కరణ చేయడం జరిగింది.

ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొంటారు. ప్రధాన వక్తగా డాక్టర్ మోదుగుల రవికృష్ణ కార్యదర్శి, విశ్వనాథ సాహిత్య అకాడమీ, గుంటూరు వారు విచ్చేయుదురు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. కావున కవులు,ప్రజలు,, ప్రజాస్వామిక వాదులు, కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసినదిగా మనవి చేస్తున్నాము, MEF MRPS, BC ST మైనార్టీ ప్రజాస్వామ్య వాదులు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్