Kandukuru: ఆటో డ్రైవర్లకు పోలీస్ నంబర్లు, క్యూఆర్ కోడ్ల అందజేత
Kandukuru: కందుకూరులో ఆటో డ్రైవర్లకు ప్రత్యేక పోలీస్ నంబర్లు, క్యూఆర్ కోడ్స్ అందజేత. డ్రైవింగ్ లైసెన్స్, నిబంధనలు పాటించాలని సీఐ అన్వర్ హెచ్చరిక.
Kandukuru: ఆటో డ్రైవర్లకు పోలీస్ నంబర్లు, క్యూఆర్ కోడ్ల అందజేత
కందుకూరు: కందుకూరు లోని డిఎస్పి ఆఫీసులో కందుకూరు పట్టణంలోని 20 మంది ఆటో డ్రైవర్లకు పోలీస్ నెంబర్స్ విత్ క్యూ ఆర్ కోడ్స్ తో కలిపి ఇవ్వడం జరిగినది. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు కొన్ని ముఖ్యమైన సూచనలు ఇవ్వడం అయినది.
దీనిలో భాగంగా ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్, వాహనానికి సంబంధించిన అన్ని వ్యాలిడిటీ ధ్రువీకరణ పత్రాలు అనగా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్, వెహికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ కలిగి ఉండాలని మరియు పరిమితికి మించి ప్యాసింజర్స్ ను ఎక్కించరాదని, మద్యపానం సేవించి వాహనాలు నడపరాదని తెలియజేయడమైనది.
కందుకూరు సబ్ డివిజన్ పరిధిలో ఉన్న ఆటో డ్రైవర్స్ అందరూ కూడా సంబంధిత పోలీస్ స్టేషన్లో పోలీస్ నంబర్స్ తీసుకోవాలని తెలియజేయడమైనది. వాహనాలు నడిపేటప్పుడు ప్యాసింజర్స్ తో సత్ప్రవర్తనతో ఉండాలని సూచించడం అయినది.
ఈ కార్యక్రమంలో కందుకూరు సిఐ అన్వర్, కందుకూరు పట్టణ ఎస్సై భార్గవ్, కందుకూరు రూరల్ ఎస్సై బాలకృష్ణ ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.




