Markapuram: దోర్నాల టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థిగా కందుల రామిరెడ్డి పోటీ!!
Markapuram: మార్కాపురం జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్ స్థానం జనరల్‌కు కేటాయించడంతో ఎమ్మెల్యే సోదరుడు కందుల రామిరెడ్డి దోర్నాల నుంచి టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు.
Markapuram: దోర్నాల టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థిగా కందుల రామిరెడ్డి పోటీ!!
Markapuram: జిల్లా జడ్పీ చైర్ పర్సన్ జనరల్ కు రావడంతో మార్కాపురం ఎమ్మెల్యే తమ్ముడు కందుల రామిరెడ్డి దోర్నాల మండలంలో శ్రీ మంతనాలమ్మ తల్లికి ముందుగా ఘనంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం కందుల రామిరెడ్డికి దోర్నాల కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు పూలదండలతో శాలువాలతో సన్మానించారు. దోర్నాల జడ్పిటిసి జనరల్ కు కేటాయించటంతో కందుల రామిరెడ్డి దోర్నాల్లో తెలుగుదేశం పార్టీ నుంచిపోటీ చేస్తున్నట్టు తెలిపారు.
దోర్నాలకు సంబంధించిన కూటమి నాయకులు,కార్యకర్తలు అందరూ కలిసి మార్కాపురం లో జడ్పిటిసి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలియజేశారు మీ అందరి సహాయ సహకారాలు తనకు అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు షేక్ మాబు, వెచ్చ హరి గోపాల్, రావి క్రింది సుబ్బరత్నం, బట్టు సుధాకర్ రెడ్డి, బోళ్ల బాలకృష్ణారెడ్డి, గుండా రెడ్డి వెంగల్ రెడ్డి, కేతి మురళి, వల్లభనేని కాశయ్య పబ్బతి, పులుకూరి పుల్లయ్య, జెడి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.




