Markapur: మార్కాపురం జడ్పీ చైర్మన్ రేసులో కందుల రామిరెడ్డి
Markapur: మార్కాపురం జడ్పీ చైర్మన్ రేసులో కందుల రామిరెడ్డి. దోర్నాల జడ్పీటీసీగా టీడీపీ తరఫున నామినేషన్ దాఖలు. నేడు లేదా రేపు ఉదయం కీలక ప్రకటన అవకాశం.
Markapur: మార్కాపురం జడ్పీ చైర్మన్ రేసులో కందుల రామిరెడ్డి
Markapur: మార్కాపురం జిల్లా రాజకీయాల్లో జడ్పీ చైర్మన్ పదవిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ మార్కాపురం నియోజకవర్గ క్లస్టర్ పోల్ మేనేజ్‌మెంట్ ఇన్‌చార్జ్ కందుల రామిరెడ్డి అనుకున్నట్లుగానే దోర్నాల మండలం జడ్పీటీసీ అభ్యర్థిగా కూటమి తరఫున టీడీపీ నుంచి నేడు నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
దోర్నాల మండలంలో పార్టీలకతీతంగా నాయకులతో ఉన్న పరిచయాలు, రాజకీయ సంబంధాల నేపథ్యంలోనే ఆయన ఈ మండలాన్ని ఎంచుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
ఇప్పటికే మార్కాపురం జిల్లా పరిషత్ చైర్మన్ రేసులో ఉన్న కందుల రామిరెడ్డి జడ్పీటీసీగా బరిలోకి దిగడంతో ఆయనకు చైర్మన్ పదవి దక్కే అవకాశాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. జడ్పీ చైర్మన్ అభ్యర్థిగా కందుల రామిరెడ్డి పేరును నేడు లేదా రేపు ఉదయం ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.
అయితే, చైర్మన్ అభ్యర్థిత్వంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. దీంతో మార్కాపురం జిల్లా రాజకీయాల్లో తదుపరి పరిణామాలపై ఉత్కంఠ కొనసాగుతోంది.




