Markapuram: మార్కాపురం తొలి జడ్పీ చైర్మన్‌గా కందుల రామిరెడ్డి పేరు పరిశీలన!

Markapuram: మార్కాపురం జిల్లా తొలి జడ్పీ చైర్మన్ రేసులో టీడీపీ నియోజకవర్గ క్లస్టర్ ఇన్‌ఛార్జ్ కందుల రామిరెడ్డి పేరు తెరపైకి. దోర్నాల నుంచి జడ్పీటీసీగా పోటీ ప్రచారం.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 19 Oct 2026 12:42 PM IST
Markapuram
X

Markapuram: మార్కాపురం తొలి జడ్పీ చైర్మన్‌గా కందుల రామిరెడ్డి పేరు పరిశీలన!

Markapuram: మార్కాపురం జిల్లా తొలి జడ్పీ చైర్మన్ పీఠంపై తెలుగుదేశం పార్టీలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. సీనియర్ నాయకుడు, టిడిపి నియోజకవర్గ క్లస్టర్ ఇంచార్జ్ కందుల రామిరెడ్డి పేరు జడ్పీ చైర్మన్ అభ్యర్థిగా తెరపైకి వస్తోంది.

దోర్నాల మండలం నుంచి జడ్పీటీసీ సభ్యుడిగా కందుల రామిరెడ్డి పోటీ చేసే అవకాశం ఉందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. దోర్నాల మండలంలో ఆయనకు శ్రేయోభిలాషులు, బంధుమిత్రులు అధికంగా ఉండటం, స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయన పోటీ చేయాలని కోరుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుండటం చర్చనీయాంశంగా మారింది.

మరోవైపు, మార్కాపురం జిల్లా తొలి జడ్పీ చైర్మన్ పదవిని కూటమి దక్కించుకోవడం టీడీపీకి ప్రతిష్ఠాత్మకంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్కాపురం జిల్లా ఏర్పాటు, వెలిగొండ ప్రాజెక్టు అంశాల్లో తీసుకున్న చర్యలను ప్రస్తావిస్తూ.. పార్టీకి, ప్రజలకు చేరువగా ఉండే నాయకుడికి జడ్పీ పీఠంపై అవకాశం కల్పించాలని టీడీపీ శ్రేణులు కోరుతున్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో కందుల రామిరెడ్డి అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని ఆయన మద్దతుదారులు పార్టీ అధిష్ఠానాన్ని కోరుతున్నట్లు తెలుస్తోంది. అయితే, జడ్పీ చైర్మన్ అభ్యర్థిగా ఆయన పేరు ఖరారైనట్లు అధికారిక ప్రకటన వెలువడలేదు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM