Kanigiri: వైయస్సార్‌సీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పులి శాంతిరెడ్డి

Kanigiri: మార్కాపురం జిల్లా కనిగిరి మున్సిపల్ ఎన్నికల వైయస్సార్‌సీపీ చైర్మన్ అభ్యర్థిగా పులి శాంతిరెడ్డిని అధిష్టానం ఖరారు చేసింది.

Guravayya, Kanigiri
Published on: 15 Oct 2026 11:16 PM IST
Kanigiri
X

Kanigiri: వైయస్సార్‌సీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పులి శాంతిరెడ్డి

Kanigiri: రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కనిగిరి మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థిగా పులి శాంతిరెడ్డిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్‌సీపీ) ప్రకటించింది. మాజీ కేంద్ర మంత్రి పులి వెంకటరెడ్డి మనవరాలైన పులి శాంతిరెడ్డి పేరును పార్టీ ఖరారు చేసింది.

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించిన వైఎస్సార్‌సీపీ అధిష్ఠానం.. కనిగిరి చైర్మన్ అభ్యర్థిగా పులి శాంతిరెడ్డిని ఎంపిక చేసింది. ఈ ప్రకటనతో కనిగిరి మున్సిపాలిటీలో రాజకీయ పరిణామాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

కనిగిరి మున్సిపాలిటీలో పార్టీ తరఫున ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా ఆమె పోటీ చేయనున్నారు.

Guravayya, Kanigiri

Guravayya, Kanigiri