Kanigiri: కనిగిరిలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు డిఎస్పి హెచ్చరికలు!

Kanigiri: కనిగిరి మున్సిపల్ నామినేషన్ల వేళ పటిష్ట భద్రత కల్పించినట్లు డిఎస్పి మద్ది శ్రీనివాసరావు తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక.

Guravayya, Kanigiri
Published on: 16 Oct 2026 6:43 PM IST
Kanigiri
X

Kanigiri: కనిగిరిలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు డిఎస్పి హెచ్చరికలు!

కనిగిరి: ​కనిగిరి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పోలీసులు అన్ని పటిష్ట ఏర్పాట్లు చేశారని, ఎన్నికల పర్యవేక్షణలో పోలీసు సిబ్బంది అంతా పూర్తి అప్రమత్తంగా నిమగ్నమై ఉన్నారని కనిగిరి డి యస్ పి మద్ది శ్రీనివాసరావు వెల్లడించరు నామినేషన్ కేంద్రం చుట్టూ 100 మీటర్ల పరిధిలో బ్యారికేడ్లు ఏర్పాటు చేసి, అనధికార వ్యక్తులు ఎవరూ లోపలకు రాకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశామని తెలిపారు.

​ఈ ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు, నాయకులకు పోలీస్ శాఖ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ.. ప్రజలందరూ స్వేచ్ఛగా, శాంతియుతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరింది. ఊరేగింపుల్లో గానీ, వాహనాల వినియోగంలో గానీ, మైక్ పర్మిషన్లు తీసుకోవడంలో గానీ తప్పనిసరిగా పోలీసు అధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

ప్రసంగాలు చేసేటప్పుడు మతం, కులం పేరుతో రెచ్చగొట్టేలా మాట్లాడటం, వ్యక్తిగతంగా దూషించుకోవడం లేదా సోషల్ మీడియా (వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్) వేదికగా ఒకరిపై ఒకరు అనుచిత వ్యాఖ్యలు చేసుకునే చర్యలకు పాల్పడకూడదని హెచ్చరించారు. ఒకవేళ ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే పోలీస్ శాఖ చాలా ఖచ్చితంగా కఠిన నిర్ణయాలు తీసుకుని నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు.

​అలాగే నామినేషన్ కేంద్రం చుట్టూ మరియు ఊరేగింపు జరిగే ప్రతి ప్రాంతంలోనూ పూర్తిస్థాయిలో వీడియో నిఘా (Video Coverage) ఏర్పాటు చేయడం జరిగిందని, ఎవరెవరు ఏమేం చేస్తున్నారో అన్నీ వీడియో రికార్డింగ్‌లో వస్తాయని తెలిపారు. కాబట్టి ఓట్లు వేసేవారు గానీ, పోటీ చేసే అభ్యర్థులు గానీ ఎలాంటి ఘర్షణలకు తావులేకుండా, శాంతియుతంగా తమ ఓటు హక్కును వినియోగించుకుని కనిగిరి మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేందుకు సహకరించాలని పోలీస్ శాఖ తరపున విజ్ఞప్తి చేస్తున్నారు.

Guravayya, Kanigiri

Guravayya, Kanigiri