Kanigiri: కనిగిరి వైసీపీ చైర్మన్ అభ్యర్థిగా పులి శాంతిరెడ్డి నామినేషన్

Kanigiri: కనిగిరి మున్సిపల్ చైర్మన్ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పులి శాంతిరెడ్డి నామినేషన్ వేశారు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

Guravayya, Kanigiri
Published on: 17 Oct 2026 3:34 PM IST
Kanigiri
X

Kanigiri: కనిగిరి వైసీపీ చైర్మన్ అభ్యర్థిగా పులి శాంతిరెడ్డి నామినేషన్

Kanigiri: మార్కాపురం జిల్లా కనిగిరి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ చైర్మన్ అభ్యర్థి పులి శాంతి రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. పులి వెంకట్ రెడ్డి బజార్‌లోని తన నివాసం నుంచి ఆమె భారీ ర్యాలీగా బయలుదేరి కనిగిరి మున్సిపాలిటీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలు సమర్పించారు.

ఈ ర్యాలీలో ఉమ్మడి ప్రకాశం జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. పులి శాంతి రెడ్డికి మద్దతుగా బూచేపల్లి వెంకాయమ్మ కూడా ర్యాలీలో పాల్గొన్నారు. కనిగిరి వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ ర్యాలీకి నాయకత్వం వహించారు.

ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులతో పాటు కనిగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. దీంతో పులి శాంతి రెడ్డి నామినేషన్ సందర్భంగా కనిగిరిలో వైఎస్సార్‌సీపీ శ్రేణుల సందడి నెలకొంది.

Guravayya, Kanigiri

Guravayya, Kanigiri