Kanigiri: కనిగిరి ఎన్నికల అధికారుల తీరుపై వైసీపీ నేతల తీవ్ర అభ్యంతరం!
Kanigiri: కనిగిరి మున్సిపాలిటీ నామినేషన్ల స్వీకరణలో అధికారుల స్పష్టత లేమిపై వైసీపీ నేతలు పులి శాంతి, గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Kanigiri: కనిగిరి ఎన్నికల అధికారుల తీరుపై వైసీపీ నేతల తీవ్ర అభ్యంతరం!
కనిగిరి: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కనిగిరిలో శుక్రవారం 32 వార్డులకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఎన్నికల అసిస్టెంట్ అథారిటీ, మున్సిపల్ కమిషనర్ శ్రీధర్ ఆధ్వర్యంలో నామినేషన్ల స్వీకరణ కోసం ఎనిమిది ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. అయితే నామినేషన్ పత్రాల జారీలో స్పష్టత లేకపోవడంతో అభ్యర్థులు అయోమయానికి గురవుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
నామినేషన్ పత్రాలు సక్రమంగా అందజేయలేదని మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, వైసీపీ నాయకురాలు పులి శాంతి, గోవర్ధన్ రెడ్డి ఎన్నికల అధికారులను ప్రశ్నించారు. నామినేషన్ ప్రక్రియకు అవసరమైన పత్రాలను పూర్తిస్థాయిలో అందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆమె పేర్కొన్నారు. దీనిపై అధికారులు మరోసారి పరిశీలించి, అవసరమైన పత్రాలను అందజేస్తామని చెప్పినట్లు పులి శాంతి, గోవర్ధన్ రెడ్డి తెలిపారు.
నామినేషన్ల దాఖలుకు కేవలం మూడు రోజులే గడువు ఉండటంతో అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారని వైసీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియలో అధికారులు స్పష్టమైన సమాచారం అందించాలని, అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేకాకుండా ఎన్నికల అధికారులు కూటమి పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ నాయకులు ఆరోపించారు.




