Karamchedu: కారంచేడు ఎంపీడీవో ఆఫీస్‌లో మండల సభ.. ఎజెండా ఇదే!

Karamchedu: బాపట్ల జిల్లా కారంచేడు మండల సర్వసభ్య సమావేశం ఈ నెల 22వ తేదీ సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ఎంపీపీ నిరుకట్టు వాసుబాబు అధ్యక్షతన జరగనుంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 18 Jun 2026 9:45 PM IST
Karamchedu
X

Karamchedu: కారంచేడు ఎంపీడీవో ఆఫీస్‌లో మండల సభ.. ఎజెండా ఇదే!

Karamchedu: కారంచేడు మండల సర్వసభ్య సమావేశం ఈ నెల 22వ తేదీ సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో మండల ఎంపిపి నిరుకట్టు వాసుబాబు అధ్యక్షతన నిర్వహించనున్నట్లు మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) నేతాజీ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.

మండల పరిధిలోని వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు సమావేశానికి హాజరై అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు, ప్రజా సమస్యలు మరియు మండలానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత అధికారులు తమ శాఖలకు సంబంధించిన పూర్తి వివరాలతో సమావేశానికి హాజరుకావాలని ఆయన సూచించారు. మండల అభివృద్ధికి సంబంధించిన అంశాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story