Singarayakonda: న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని పెంచాలి: కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె. మన్మధరావు

Singarayakonda: సింగరాయకొండ సివిల్ జడ్జి కోర్టు ప్రథమ వార్షికోత్సవంలో కర్ణాటక హైకోర్టు జడ్జి జస్టిస్ కె. మన్మధరావు పాల్గొన్నారు. న్యాయవ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని పెంచాలని ఆయన పిలుపునిచ్చారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 7 May 2026 9:23 PM IST
Singarayakonda
X

Singarayakonda: న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని పెంచాలి: కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె. మన్మధరావు

సింగరాయకొండ: సింగరాయకొండ సివిల్ జడ్జి కోర్టు ప్రారంభించి సంవత్సరం పూర్తయిన సందర్భంగా నిర్వహించిన ప్రధమ వార్షికోత్సవ వేడుకలు బుధవారం రాత్రి ఘనంగా నిర్వహించబడ్డాయి.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె. మన్మధరావు సభను ఉద్దేశించి ప్రసంగించారు. న్యాయవ్యవస్థ పట్ల ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ఆయన తన ప్రసంగంలో పేర్కొన్నారు. కోర్టు యొక్క తీర్పులలో భాషా ప్రావీణ్యతను తెలియజేస్తూ, తాను తక్కువ సమయంలో ఎక్కువ కేసులను తీర్పు ఇచ్చిన అంశాల్ని తెలియజేశారు.అదేవిధంగా జూనియర్ న్యాయవాదులు ఉన్నతమైన లక్ష్యంతో ముందుకు పోవాలని, మహిళ న్యాయవాదులకు ప్రాతినిధ్యం ఎక్కువ ఇస్తున్నారని,అదేవిధంగా మునుపుటి కంటే ఇప్పుడు వారు ప్రాక్టీస్ లోకి ఎక్కువ వస్తున్నారన్నారు. తన గత 30 సంవత్సరాల న్యాయవాద వృత్తిలో స్థానిక కందుకూరు మరియు ఒంగోలు కోర్టులలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసిన రోజులను గుర్తు చేసుకున్నారు.కార్యక్రమ అనంతరం బార్ అసోసియేషన్ సభ్యులు న్యాయమూర్తులను ఘనంగా సత్కరించారు.

కార్యక్రమంలో సివిల్ జడ్జి శ్రీమతి డాక్టర్ వి. లీలా శ్యాంసుందరి పాల్గొని తన సందేశాన్ని అందించగా ,ఈ వేడుకలకు సింగరాయకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులు సన్నెబోయిన శ్రీనివాసులు సభకు అధ్యక్షత వహించారు. ఒంగోలు, కందుకూరు మరియు సింగరాయకొండ బార్ అసోసియేషన్‌లకు చెందిన న్యాయవాదులు, పోలీసు సిబ్బంది, కోర్టు సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story