Komarole: అట్టహాసంగా 'ఇంటింటికి కామూరి కుటుంబం' కార్యక్రమం
Komarole: కొమరోలు మండలంలో అట్టహాసంగా ఇంటింటికి కామూరి కుటుంబం కార్యక్రమం. ప్రజలను కలిసి కృతజ్ఞతలు తెలిపిన కామూరి రమణారెడ్డి.
Komarole: అట్టహాసంగా 'ఇంటింటికి కామూరి కుటుంబం' కార్యక్రమం
కొమరోలు: మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలోని రెడ్డిచెర్ల, పోసుపల్లి పంచాయతీలలో అట్టహాసంగా ఇంటింటికి కామూరి కుటుంబం కార్యక్రమం జరిగింది. శుక్రవారం ఇంటింటికి కామూరి కుటుంబం కార్యక్రమాన్ని కామూరి రమణారెడ్డి గారు నిర్వహించారు. గ్రామస్తులు రమణారెడ్డికి అపూర్వ స్వాగతం పలికారు.
పూలమాలలు శాలువాతో సత్కరించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను పలకరించిన రమణారెడ్డి పది సంవత్సరాల పాటు రెండు పర్యాయాలు ఎంపీపీ గా గెలిపించి తమ కుటుంబాన్ని ఆదరించిన మండల ప్రజలకు పంచాయతీల వారీగా ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరికి ఇంటింటికి తిరిగి కృతజ్ఞతలు తెలియజేశారు.
2029 ఎన్నికలలో మరోమారు సీఎంగా జగనన్నను గెలిపించు కోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ముందుగా గోపాలుని పల్లి గ్రామం నుండి కార్యక్రమాన్ని ప్రారంబించారు.
అక్టోబర్ 5వ తేదీన కొమరోలు మండలంలో సుభోజనం కార్యక్రమం ద్వారా పేదలందరికీ ఇంటి వద్దకే ఆహారాన్ని అందించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రజలకు వివరించారు .కార్యక్రమానికి ప్రతి ఒక్కరు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.




