Komarolu: శ్రీ సిద్ధభైరవేశ్వర స్వామిని దర్శించుకున్న కామూరి రమణారెడ్డి

Komarolu: కార్తీక పౌర్ణమి సందర్భంగా మార్కాపురం జిల్లా కొమరోలు మండలం శ్రీ సిద్ధభైరవేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన వైసీపీ నేత కామూరి రమణా రెడ్డి.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 24 Nov 2026 4:17 PM IST
Komarolu
X

Komarolu: శ్రీ సిద్ధభైరవేశ్వర స్వామిని దర్శించుకున్న కామూరి రమణారెడ్డి

కొమరోలు: మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలోని శ్రీ సిద్ధభైరవేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

ఈ సందర్భంగా గిద్దలూరు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ నాయకులు (అన్నదాత) కామూరి రమణా రెడ్డి ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు.

అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అర్చకులు అందించిన తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU