Konakanamitla: కొనకనమిట్ల జడ్పీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి రామిరెడ్డి ఘన విజయం!
Konakanamitla: కొనకనమిట్ల జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ విజయం. వైసీపీ అభ్యర్థిపై 2,360 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన కామసాని రామిరెడ్డి.
Konakanamitla: కొనకనమిట్ల జడ్పీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి రామిరెడ్డి ఘన విజయం!
కొనకనమిట్ల: కొనకనమిట్ల మండల జడ్పీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ హవా కొనసాగింది. టీడీపీ అభ్యర్థి కామసాని రామిరెడ్డి తన సమీప ప్రత్యర్థి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాటపాటి సుధాకర్ రెడ్డిపై 2,360 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు.
ఓట్ల లెక్కింపు ప్రక్రియలో మొదటి నుంచి ఆధిక్యం కనబరిచిన కామసాని రామిరెడ్డి చివరి వరకు అదే ఆధిక్యాన్ని కొనసాగిస్తూ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఆయనకు మొత్తం 16,262 ఓట్లు రాగా, కాటపాటి సుధాకర్ రెడ్డికి 13,902 ఓట్లు పోలయ్యాయి. దీంతో 2,360 ఓట్ల తేడాతో కామసాని రామిరెడ్డి విజయం ఖరారైంది. నోటాకు 113 ఓట్లు నమోదయ్యాయి.
మండల పరిధిలో మొత్తం 38,655 మంది ఓటర్లు ఉండగా, 31,345 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీటిలో 826 ఓట్లు చెల్లనివిగా నమోదవగా, 30,519 ఓట్లు చెల్లుబాటయ్యాయి.
జడ్పీటీసీ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకోవడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. ఈ విజయం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది.




