Konakanamitla: కొనకనమిట్లలో ఓఎస్డీ కాళ్లపై పడిన వైసీపీ అభ్యర్థులు!
Konakanamitla: మార్కాపురం జిల్లా కొనకనమిట్ల నామినేషన్ కేంద్రం వద్ద వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఓఎస్డీ నవజ్యోత్ మిశ్రా కాళ్లపై పడి భద్రత కల్పించాలని ప్రాధేయపడ్డారు
Konakanamitla: కొనకనమిట్లలో ఓఎస్డీ కాళ్లపై పడిన వైసీపీ అభ్యర్థులు!
Konakanamitla: మార్కాపురం జిల్లా కొనకనమిట్ల మండలంలోని నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించేందుకు వచ్చిన ఓఎస్డీ నవజ్యోత్ మిశ్రాను వైఎస్సార్‌సీపీకి చెందిన మునగపాడు ఎంపీటీసీ అభ్యర్థి పెరికె బాల గురవమ్మ (ఎస్సీ), కాట్రగుంట ఎంపీటీసీ అభ్యర్థి ఎదుబాటి రమణమ్మతో పాటు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిశారు. నామినేషన్ ప్రక్రియలో తమకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, నామినేషన్ కేంద్రం వద్ద ఉండి తమ పర్యవేక్షణలో నామినేషన్లకు అనుమతి కల్పించాలని వారు ఓఎస్డీని కోరారు.
ఈ సందర్భంగా పెరికె బాల గురవమ్మ, ఎదుబాటి రమణమ్మతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు ఓఎస్డీ నవజ్యోత్ మిశ్రా కాళ్లపై పడి తమ సమస్యలను వివరించరు. నామినేషన్ దాఖలు చేసే సమయంలో ఎలాంటి అవాంతరాలు, అడ్డంకులు తలెత్తకుండా భద్రత కల్పించాలని వారు ప్రాధేయపడ్డారు.
నామినేషన్ కేంద్రం వద్ద పరిస్థితులను పరిశీలించిన ఓఎస్డీ నవజ్యోత్ మిశ్రా అధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా, ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.




