Markapuram: 'జల్ జీవన్ మిషన్' వాటర్ ట్యాంక్ పనుల్లో నాణ్యతా లోపాలు

Markapuram: పెద్దారవీడు మండలం కొత్తూరు గ్రామంలో రూ.11 లక్షల జల్ జీవన్ మిషన్ నిధులతో నిర్మిస్తున్న వాటర్ ట్యాంక్‌లో నాణ్యతా లోపాలు కలకలం రేపుతున్నాయి.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 2 Jun 2026 8:35 PM IST
Markapuram
X

Markapuram: 'జల్ జీవన్ మిషన్' వాటర్ ట్యాంక్ పనుల్లో నాణ్యతా లోపాలు

Markapuram: మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం బద్వీడు పంచాయతీ పరిధిలోని కొత్తూరు గ్రామంలో జల్ జీవన్ మిషన్ నిధులతో సుమారు రూ.11 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న నూతన తాగునీటి వాటర్ ట్యాంక్ నాణ్యతపై గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ నిర్మాణ పనుల్లో తగిన నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ట్యాంక్ నిర్మాణ దశలో తప్పనిసరిగా నిర్వహించాల్సిన వాటర్ క్లియరింగ్ ప్రక్రియను చేపట్టకపోవడం వల్ల నిర్మాణ నాణ్యత దెబ్బతింటోందని గ్రామస్తులు పేర్కొంటున్నారు.

నిర్మాణ పనులను పర్యవేక్షించాల్సిన సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ప్రజాధనంతో నిర్మిస్తున్న కీలక తాగునీటి ప్రాజెక్టులో లోపాలు చోటుచేసుకోవడం బాధాకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న ట్యాంక్ పూర్తయ్యేలోపే నాణ్యత సమస్యలు కనిపించడం అధికారుల నిర్లక్ష్యా వైఖరికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు వెంటనే స్పందించి నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, వాటర్ క్లియరింగ్ నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story