Peddaraveedu: తిరుమలనాథ స్వామి తిరునాళ్లు ఒకే వేదికపై కేపీ కొండారెడ్డి మన్నే రవీంద్ర

Peddaraveedu: రాజంపల్లి గొడ్రాలికొండ తిరుమలనాథ స్వామి తిరునాళ్లలో అరుదైన దృశ్యం. రాజకీయ భేదాలు పక్కనబెట్టి ఒకే వేదికపై కలిసిన కేపీ కొండారెడ్డి, మన్నే రవీంద్ర.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 4 July 2026 3:09 PM IST
Peddaraveedu
X

Peddaraveedu: తిరుమలనాథ స్వామి తిరునాళ్లు ఒకే వేదికపై కేపీ కొండారెడ్డి మన్నే రవీంద్ర

పెద్దారవీడు: పెద్దారవీడు మండలం రాజంపల్లి గ్రామంలో వెలసిన శ్రీ గొడ్రాలికొండ తిరుమలనాథ స్వామి వారి వార్షిక తిరునాళ్లు భక్తిశ్రద్ధలతో ఘనంగా కొనసాగుతున్నాయి. మాజీ ఎంపీపీ ఏర్వ కోటిరెడ్డి, ఆయన కుమారుడు రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి ఏర్వ శేషసేనారెడ్డి ఆధ్వర్యంలో తిరునాళ్ల ఏర్పాట్లు వైభవంగా నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డి, టీడీపీ సీనియర్ నాయకుడు డాక్టర్ మన్నే రవీంద్ర ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు శ్రీ తిరుమలనాథ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు.

రాజకీయంగా వేర్వేరు పార్టీలకు చెందిన కేపీ కొండారెడ్డి, డాక్టర్ మన్నే రవీంద్ర ఒకే వేదికపై కలిసి కనిపించడం స్థానికంగా చర్చనీయాంశమైంది. రాజకీయ భేదాలకు అతీతంగా దైవ కార్యక్రమంలో పాల్గొనడం అందరి దృష్టిని ఆకర్షించింది.

ఈ అరుదైన కలయికను చూసిన భక్తులు, నాయకులు "దైవం ముందు అందరూ సమానమే" అనే సందేశాన్ని ప్రతిబింబించే ఘటనగా అభిప్రాయపడ్డారు. వారితో పాటు టిడిపి మాజీ మండల అధ్యక్షుడు వెంకట రెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు కంచర్ల కేశయ్య యేసయ్య, వెంకటరెడ్డి మరియు టిడిపి, వైసిపి నాయకులు పాల్గొన్నారు

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story