Giddalur: వైఎస్‌ఆర్‌సీపీ భారీ ర్యాలీ విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామాకు డిమాండ్!

Giddalur: మార్కాపురం జిల్లా గిద్దలూరులో వైఎస్‌ఆర్‌సీపీ ఇన్ ఛార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 10 Aug 2026 5:33 PM IST
Giddalur
X

Giddalur: వైఎస్‌ఆర్‌సీపీ భారీ ర్యాలీ విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామాకు డిమాండ్!

గిద్దలూరు: గిద్దలూరు పట్టణంలో వైసిపి ఇన్ ఛార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో పార్టి నాయకులతో కార్యకర్తలతో,భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. మెగా డీఎస్సీలో జరిగిన అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైసిపి నాయకులు, కార్యకర్తలు డిమాండ్ చేశారు.

ముందుగా గాంధీ బొమ్మ సెంటర్ లో గాంధీ విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించి అనంతరం ర్యాలీగా పట్టణంలోని ప్రధాన కూడళ్ల గుండా రాచర్ల గేట్ వైయస్సార్ విగ్రహం వరకు నిర్వహించారు. తర్వాత మెగా డీఎస్సీ లో జరిగిన అవకతవకలపై సిబిఐ ఎంక్వయిరీ జరిపించాలని ఇన్చార్జ్ నాగార్జున రెడ్డి డిమాండ్ చేశారు. అర్హులైన అభ్యర్థులకు కాకుండా పేకాట ఆడిన వారికి కూడా టీచర్ ఉద్యోగాలు ఇచ్చారని ఆయన ఎద్దేవ చేశారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU

Next Story